ఆ చెట్టు కింద సమాధి చేయండి.. అంతిమ యాత్ర గురించి రాకేశ్‌ మాస్టర్‌

-

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ ఆకస్మిక మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ విషాదంలో కూరుకుపోయింది. దాదాపు 1500 పాటలకు రాకేశ్ మాస్టార్ కొరియోగ్రఫీ చేశారు. అగ్ర కథానాయకుల నుంచి యంగ్‌ హీరోల చిత్రాలకు పనిచేసిన ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా పలువురు సంతాపం ప్రకటించారు. ఆయనతో తమకు ఉన్న బంధం గురించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తన మరణం గురించి.. మరణం అనంతరం తనను ఎక్కడ సమాధి చేయాలనే దానిపై మాట్లాడారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.

రాకేశ్‌ మాస్టర్‌ తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియో తీశామని తెలిపారు. ‘‘నా మామగారు (భార్య తండ్రి) సమాధి పక్కన వేప మొక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్‌ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా’’ అని ఓసారి రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news