షూటింగ్ స్పాట్ నుండి మిస్సయిన రకుల్ ?

బాలీవుడ్ డ్రగ్స్ మంటలు టాలీవుడ్‌ను తాకాయి. మాదక ద్రవ్యాల దందాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరో, హీరోయిన్లు కూడా ఉన్నారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తున్న మాదక ద్రవ్యాల కేసు బాలీవుడ్ మీదగా టాలీవుడ్‌ వచ్చి ఆగింది. రియా అరెస్టయిన రెండు రోజులు తర్వాత … విచారణలో ఆమె వెల్లడించిన వివరాలు టాలీవుడ్‌ వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి.

రియా అధికారులకు అందించిన 25 మంది డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో మోస్ట్ పాపులర్ తెలుగు హీరోయిన్ రకుల్ పేరు ఉండడం చూసి తెలుగు సినీ ప్రపంచం ఖంగుతిందని చెప్పచ్చు. అయితే ఈ వ్యవహారంలో తన పేరు బయటకు రావడంతో రాకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు షూట్ చేస్తున్న అనంతగిరి అడవుల నుండి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. ఇక రియా చెప్పిన జాబితాలో మరికొందరు టాలీవుడ్‌ స్టార్లు ఉన్నట్టు తెలుస్తోంది. రియా ఫోన్ కాల్‌ డేటాలో తెలుగు హీరోలు, హీరోయిన్ల నెంబర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.