ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జి.డి.పి క్షీణించటం నిరుద్యోగం పెరగడం పై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు. ఈ మేరకు నాలుగు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
1 కరోనా వైరస్ కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన పోరాటం చేయలేదని రాహుల్ గాంధీ మొదటి ఆరోపణ చేశారు. 2 దేశంలో 12 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 3 ప్రజలపై 15.5 లక్షల కోట్ల అదనపు ఒత్తిడితో కూడిన రుణాలు మోపారు అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.4 రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని రాహుల్ నాలుగో విమర్శ చేశారు. కరోనా వైరస్ కేసుల్లో లో భారత్ బ్రెజిల్ ను అధికమించి రెండో స్థానంలో నిలిచిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఆయన మండిపడ్డారు.