రకుల్ అందాలు అక్కడ వారికేనా.. ఇలా రెచ్చిపోతుందేంటో..!

-

తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు అందుకుంటున్న రకుల్ బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న దే దే ప్యారే దే సినిమాలో నటిస్తుంది అమ్మడు. మే 17న రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈమధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రకుల్ మరింత రెచ్చిపోయిందని తెలుస్తుంది.

ఇక సినిమా నుండి లేటెస్ట్ గా వడ్డి షరాబన్ సాంగ్ రిలీజ్ చేశారు. సరదాగా సాగే ఈ పాటలో రకుల్ మందు బాటిల్ తో చేసిన రచ్చ మాములుగా లేదు. తన నటనే కాదు తన లుక్స్ తో కూడా కుర్రాళ్లను డిస్ట్రబ్ చేస్తుంది రకుల్. ముఖ్యంగా ఈ పాటలో కట్టింది సారీనే అయినా అమ్మడి అందాల ప్రదర్శన మాత్రం అదరగొట్టింది. బాలీవుడ్ లో స్థిరపడాలంటే ఈమాత్రం చేయక తప్పదని గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసింది రకుల్. మరి ఇంకెందుకు ఆలస్యం దే దే ప్యార్ దేలో రకుల్ రచ్చ చేసిన ఆ సాంగ్ మీరు చూసేయండి..

Read more RELATED
Recommended to you

Latest news