పెళ్లికి ముందు తొందరపడకండి.. పెళ్లి ముందు సెక్స్ చేస్తే అది రేపేనట.. సుప్రీం సంచలన తీర్పు

-

ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కు చెందిన ఓ యువతికి డాక్టర్ అనురాగ్ సోనితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో 2009 నుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని సోని ఆ యువతికి మాట కూడా ఇచ్చాడు.

సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పెళ్లి ముందు సెక్స్ చేస్తే రేప్ తో సమానమట. పెళ్లి చేసుకోబోయే జంట తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి ముందు సెక్స్ చేస్తే అది నేరం అట.. ఆ సెక్స్ అత్యాచారం కిందికే వస్తుందట.

Supreme sensational verdict on living in relationship

ఈ తీర్పును సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఎంఆర్ షాతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంలో దాఖలు అయిన ఓ కేసులో భాగంగా ఈ తీర్పును ఇచ్చింది.

ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కు చెందిన ఓ యువతికి డాక్టర్ అనురాగ్ సోనితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో 2009 నుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని సోని ఆ యువతికి మాట కూడా ఇచ్చాడు. దీంతో ఆ యువతి అతడిని నమ్మి అతడితో సెక్స్ లో పాల్గొన్నది. చాలా సార్లు ఆ యువతిని వాడుకున్న సోని తర్వాత మొహం చాటేశాడు. ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెస్తే చాలు ఆ డాక్టర్ తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఆ కేసును విచారించిన సుప్రీం.. పెళ్లి పేరుతో అమ్మాయితో సెక్స్ చేసి మోసం చేయడం అత్యాచారం కిందికే వస్తుందని తెలిపింది.

అత్యాచారం కేసు కింద ఆ డాక్టర్ కు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంతే కాదు.. ఈ జనరేషన్ లో ఇటువంటి నేరాలు చాలా జరుగుతున్నాయని… అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని న్యాయమూర్తి వెల్లడించారు. అందుకే.. ఇటువంటి నేరాలు మున్ముందు జరగకుండా ఉండాలంటే కఠిన శిక్షలు అమలు చేయాలని.. అందుకే ఆ వ్యక్తిని ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్టు న్యాయమూర్తి తీర్పిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news