రకుల్ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ హ్యాక్..!

-

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ హ్యాక్ అయ్యిందని ట్వీట్ చేసింది. మీరు ఎవరు ఆ ఎకౌంట్ నుండి వచ్చే మెసేజులకు, లింకులకు రెస్పాండ్ అవ్వొద్దని కోరింది రకుల్ ప్రీత్ సింగ్. ఈమధ్య హీరోయిన్స్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఎకౌంట్స్ హ్యాక్ అవడం వింటూనే ఉన్నాం. ఈమధ్యనే త్రిష ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ చేశారని తెలియగా ఇప్పుడు రకుల్ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ హ్యాక్ చేయబడిందట.

అది రికవర్ అయ్యేంతవరకు మీరెవరు రెస్పాండ్ అవ్వొద్దని తన ఫాలోవర్స్ ను కోరింది రకుల్. ప్రస్తుతం కోలీవుడ్ లో కార్తి హీరోగా వస్తున్న దేవ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది రకుల్. స్పైడర్ తర్వాత రకుల్ తెలుగులో అవకాశాలు సనంగిల్లాయి. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తుంది రకుల్. కేవలం 20 నిమిషాల రోల్ కోసం రకుల్ కోటి దాకా డిమాండ్ చేసిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version