రామ్ చరణ్ వరసగా 6 సినిమాలు నిజంగా చేస్తున్నాడా.!

-

లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కి గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ తమ స్టయిల్ తో ఇంప్రెస్ చేసిన సంగతి తెలిసిందే..

ఇంకా అక్కడే ఉన్న ఇద్దరూ తమ అవార్డ్ సెలెబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే  హాలీవుడ్ మీడియా కు ఇంటర్వ్యూ లు ఇస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ సందర్భంగా రాంచరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుండి కాల్ వస్తే సినిమా చేస్తారా? అంటూ మాల్కిన్ ప్రశ్నించగా..తప్పకుండా చేస్తాను అంటూ చరణ్ ఆన్సర్ ఇచ్చాడు.

అలాగే తాను చేస్తున్న సినిమాల గురించి చెబుతూ ప్రస్తుతం తన చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయని చెప్పి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇది విన్న తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మందికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రస్తుతం ఒక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు తప్ప మిగిలిన వారికి అంత సీన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి డైరెక్టర్ శంకర్ మరియు బుచ్చి బాబు సినిమాలు మాత్రమే అధికారకంగా లైన్ లో ఉన్నాయి. మరి రామ్ చరణ్ ఏ విధంగా ఆరు సినిమాలు అని చెప్పాడా అని ఇక్కడి వారు బుర్ర గోక్కుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news