జగన్‌కు ప్రేమతో ముద్రగడ..ఎంతకాలం?

-

ఏపీలో ఒకప్పటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి సీఎం జగన్‌కు లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని, కాపు, ఒంటరి, తెలగ, బలిజ కులాలకు రిజర్వేషన్ల కల్పించాలని,  అన్నీ పార్టీల వారూ ఈ కులలని ఉపయోగించుకుని వదిలేశారని, మీరు అలా చేయవద్దని, కాపుల రిజర్వేషన్లు కల్పిస్తే వారు జీవితాంతం మీకు రుణపడి ఉంటారని జగన్‌కు ముద్రగడ లేఖ రాశారు.

అయితే ఇలా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముద్రగడ ప్రేమ లేఖలు మాదిరిగా రాస్తూనే ఉన్నారని, అదే కాపు రిజర్వేషన్లని 5 శాతం అమలు చేసిన చంద్రబాబుపై మాత్రం విద్వేషంతో ఉంటారని, ఆ రిజర్వేషన్లని అమలు చేయని జగన్‌పై ఎలాంటి విమర్శలు ఉండవని, పైగా ప్రేమ లేఖలు మాదిరిగా రాస్తూ ఉంటారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నాయి. అయితే టీడీపీ అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్లు అంటూ ముద్రగడ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసే కోణంలోనే ముద్రగడ ముందుకెళ్లారనే విమర్శలు ఉన్నాయి.

Mudragada Padmanabham: అందుకే జగన్‌కు లేఖల మీద లేఖలు రాస్తున్నారా? | Mudragada Padmanabham Making Route for Political Career

ఎందుకంటే బాబు అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అక్కడ అది పెండింగ్ లో పడింది. అది పెండింగ్ లో ఉండటంతో కాపు కార్పొరేషన్ ద్వారా..ఆ వర్గానికి అండగా నిలిచారు. ఇక చివరిగా కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీలో ఎక్కువగా కాపులకు అందులో 5 శాతం, మిగిలిన కులాలకు 5 శాతం చంద్రబాబు కేటాయించారు.

కానీ జగన్ కాపు రిజర్వేషన్లు చేయలేమని ముందే చేతులెత్తేశారు..అలాగే అధికారంలోకి వచ్చాక ఒక కులానికి 5 శాతం ఇవ్వడం కుదరదని, టోటల్ గా 10 శాతం అమలు ఆపేశారు. ఆ మధ్య కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తగినట్లుగా ఇచ్చుకోవచ్చని చెప్పింది. అయినా సరే జగన్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లపై నో రెస్పాన్స్..దాని కోసం కాపుసేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య దీక్ష కూడా చేశారు. అయినా నో యూజ్..ఇక దీనిపై ముద్రగడ ఒకసారి జగన్‌కు లేక రాశారు. మళ్ళీ ఇప్పుడు రాశారు. కానీ రిజర్వేషన్లపై గట్టిగా డిమాండ్ చేయడం లేదు..జగన్‌కు మేలు కలిగేలా లేఖలు రాస్తున్నారని, పైగా బాబు ఉన్నంత సేపు కాపు ఉద్యమం పేరిట హడావిడి చేసి..జగన్ అధికారంలోకి వచ్చాక కావాలని సైలెంట్ అయ్యారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news