టీమిండియా ప్లేయర్‌ను బూతులు తిట్టిన హార్దిక్ పాండ్యా

-

కోల్కత్తా వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సహనాన్ని కోల్పోయాడు.

శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా వాటర్ బాటిల్ అందించడం ఆలస్యం కావడంతో హార్దిక్, సహచర సబ్సిటిట్యూట్ ఫీల్డర్ ఒకరిపై గట్టిగా అరుస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. హార్దిక్ మాటలు స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి.

ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరిలో చోటుచేసుకుంది. ఇక హార్దిక్ వాయిస్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో హార్దిక్ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. కేవలం వాటర్ కోసం సహచర ఆటగాడిని అలా దుర్భాషలాడడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news