మీ అంచనాలను అందుకోలేదు క్షమించండి : రాం చరణ్

-

బోయపాటి డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన సినిమా వినయ విధేయ రామ. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకోగా ఫైనల్ గా సినిమా ఫ్లాప్ మూవీగా నిలిచింది. రంగస్థలం తర్వాత రాం చరణ్ చేసిన సినిమాగా భారీ అంచనాలతో వచ్చిన వినయ విధేయ రామ పూర్తిగా దర్శకుడి వైఫల్యం వల్లే ఫ్లాప్ అయ్యిందని తెలిసిందే.

బోయపాటి రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను చెడగొట్టాడు. ఇక ఈ సినిమా ఫలితంపై ఇన్నాళ్లకు స్పందించాడు రాం చరణ్. ప్రియమైన అభిమానులకు, ప్రేక్షకులకు అంటూ రాం చరణ్ ఓ లెటర్ రాయడం జరిగింది. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ లెటర్ పోస్ట్ చేశాడు. మీ అంచనాలను అందుకోలేదు క్షమించండి.. భవిష్యత్తులో ఎలాంటి శక్తివంచన లేకుండా మీకు నచ్చే సినిమా చేస్తానని అన్నాడు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమకు ధన్యవాదములు అంటూ చరణ్ తన లెటర్ ముగించాడు.

సినిమా పోయిందని ఒప్పుకోడానికి ఏ హీరోకైనా సరే గట్స్ ఉండాలి. అలాంటిది ఏకంగా అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశించి మీ అణనాలను అందుకోలేదని రాం చరణ్ రాసిన లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news