అదిరిపోయిన సర్‌ప్రైజ్.. కనబడితే నిప్పుకణం.. అల్లూరిగా అదిరిపోయిన రామ్ చరణ్

-

ఆర్ఆర్ఆర్ సర్ ప్రైజ్ అంటూ ఉదయం నుంచి జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. రాజమౌళి, చిరంజీవి ఎంటర్ అవ్వడం, రామ్ చరణ్-ఎన్టీఆర్ ట్వీట్లు ఏ రేంజ్‌లో హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. రాజమౌళి వల్లే ఆలస్యమైందని ఎన్టీఆర్ పేర్కొనడం, ఆలస్యం వెనుక సంజాయిషీని చిరుకు చెప్పుకోవడం అంతా ఫన్నీ ఫన్నీగా సాగింది.

లాక్ డౌన్ ఉన్న కారణంగా.. డిజిటిల్ ఫ్లాట్‌ఫామ్‌లో సర్‌ప్రైజ్ రివిలీ చేస్తానని, నన్ను నమ్ము, ఇది జీవితంలో మరిచిపోలేవని ఎన్టీఆర్ ట్వీట్‌ చేయడం, అది కాస్తా రాజమౌళి చేతికి వెళ్లడం.. ఆలస్యం అవుతుందని రామ్ చరణ్‌కు ఎన్టీఆర్ క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఆయన చేతికి ఇచ్చావా? ఈ రోజు నాకు ఆ సర్‌ప్రైజ్ వస్తుందా? అంటూ రామ్ చరణ్ ఫైర్ అయిన విషయం కూడా తెలిసిందే.

సాయంత్రం నాలుగు గంటలకు కచ్చితంగా వస్తుందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. అయితే ఈ సారి మాత్రం మాట తప్పలేదు. చెప్పిన సమయానికే సర్ ప్రైజ్ గిఫ్ట్‌ను రివీల్ చేశారు. కనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటది…. కలబడితే వేగు చుక్క ఎగబడినట్టు ఉటంది.. ఎదురుపడితే చావుకైనా చెమట దారపడతి…. ప్రాణమైనా బంధుకైనా బాంచన్ అంటంది. ఇంటి పేరు అల్లూరి.. మన్నెం దొర నా అన్న..అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదిరిపోగా.. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా సీత పాత్రలో అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news