రాం చరణ్ ని ఇంప్రెస్ చేసిన ‘మనం’ డైరెక్టర్ … నెక్స్ట్ ప్రాజెక్ట్ లాక్ ..!

-

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్‌ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 2021 జనవరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని అధికారికంగానే ప్రకటన వచ్చేసింది. కానీ ఇన్నాళ్ళు రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది డైలమామాలో ఉండింది. ఆ విషయంలో క్లారిటీ వచ్చేసిందని తాజా సమాచారం.

 

’13బి’, ‘మ‌నం’, ‘హ‌లో’, ‘గ్యాంగ్ లీడ‌ర్’ లాంటి వైవిధ్యభరితమైన సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శకుడు విక్రమ్ కె.కుమార్. ఈ దర్శకుడు రీసెంట్‌గా రామ్‌ చరణ్ కలిసి కథ వినిపించాడట. అయితే ఇప్పటి వరకు రామ్‌ చరణ్ విన్న కథల కంటే విక్రమ్ కె.కుమార్ చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో.. రామ్‌ చరణ్ మనం సినిమా చేద్దాం అని విక్రమ్ కె.కుమార్ కి మాటిచ్చారట.

ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌బోతుందని తెలుస్తోంది. రామ్‌ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ అవగానే ఈ సినిమాతో సెట్స్ పైకి వెళతారని సమాచారం. అయితే.. ఈ మధ్య విక్రమ్‌కు కె.కుమార్ వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మరి రామ్‌ చరణ్ సినిమాతో అయినా విక్రమ్‌కు కె.కుమార్ సక్సస్ ని అందుకుంటాడా లేదా అంటూ మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version