భీమ్ మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్‌!

-

 

`ఆర్ఆర్ఆర్`లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ‌కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ పాత్ర‌కు సంబంధించిన లుక్‌తో పాటు టీజ‌ర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ‌త ఐదు నెల‌లుగా నిరీక్షిస్తున్నారు. వారి నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డుతోంది. రామ్‌చ‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అల్లూరి సీతారామ‌రాజు కు సంబంధించిన లుక్‌ని టీజ‌ర్‌ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

అదే స్థాయిలో ఎన్టీఆర్ పుట్టిన రోజున భీమ్ లుక్‌తో పాటు టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తార‌ని అంతా ఎదురుచూశారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఎన్టీఆర్ టీజ‌ర్‌కు సంబంధించిన ఫుటేజ్‌ని షూట్ చేయ‌లేక‌పోయామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించి నిరుత్సాహ‌ప‌రిచింది. తాజాగా మ‌ళ్లీ షూటింగ్ మొద‌లుకావ‌డంతో ముందు ఎన్టీఆర్‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు రాజ‌మౌళి.

దీనికి రామ్‌చ‌ర‌ణ్ త‌న‌దైన స్టైల్లో వాయిస్ ఓవ‌ర్ అందించారు. అన్ని భాష‌ల్లోనూ భీమ్‌ని ఇంట్ర‌డ్యూస్ చేస్తూ రామ్‌చ‌ర‌ణ్ చెప్పిన వాయిస్ ఓవ‌ర్ హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ట‌. ఇదిలా వుంటే భీమఃకి సంబంధించిన ప్రీలుక్ విజువ‌ల్స్‌ని రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా రిలీజ్ చేశాడు. భీమ్ వాట‌ర్‌లోంచి బ‌ల్లెన్ని తీస్తున్నవిజువ‌ల్స్ మైండ్ బ్లోయింగ్‌గా వున్నాయి. సింగిల్ విజ‌వ‌లే ఈ రేంజ్‌లో వుంటే టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్‌గా వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. దీనిపై రామ్‌చ‌ర‌ణ్ ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు. బ్ర‌ద‌ర్ నీకోసం ఓ చిన్న గిఫ్ట్ వుంది. దాన్ని టైమ్‌కే ఇస్తా అని ట్వీట్ చేశాడు. దీనికి ఎన్టీఆర్ రిప్లై అదిరిపోయింది. బ్రో ఇప్ప‌టికే 5 నెల‌లు ఆల‌స్య‌మైంది. జ‌క్క‌న్న‌తో డీల్ చేస్తున్నావ్ జాగ్ర‌త్త అంటూ ఫ‌న్నీగా రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news