మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. భరత్ అనే నేను సినిమాతో మహేష్ సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు రాం చరణ్ తో ఆడిపాడుతుంది. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ తందానే తందానే సాంగ్ వచ్చింది.
ఇక ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తస్సాదియ్యా అంటూ చరణ్, కియరా రొమాంటిక్ నెంబర్ గా వస్తున్న ఈ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. సాంగ్ లో చరణ్ స్టెప్పులే అదిరిపోయాయ్ అనుకుంటుంటే కియరా మెరుపులు కూడా దుమ్ముదులిపేసిందని చెప్పొచ్చు. దేవి మార్క్ ట్రెండీ మ్యూజిక్ తో వచ్చిన ఈ సాంగ్ కు శ్రీమణి సాహిత్యం అందించాడు.
చల్లటి ఈ సాయంత్రం వేళ కియరా అదాలతో హీటెక్కించే ప్రయత్నం చేస్తున్నారు బోయపాటి శ్రీను. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.