ఏపిలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్ కోసం విజయవాడలో ఈరోజు సాయంత్రం ఓ ప్రెస్ మీట్ పెట్టాలని చూశాడు దర్శక నిర్మాత రాం గోపాల్ వర్మ. విజయవాడ నోవాటెల్ లో ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నా వారు ముందు పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత ఎందుకో వద్దనేశారట. ఇలా అన్ని రెస్టారెంట్స్, హోటల్స్ హ్యాండి ఇవ్వడంతో పైపుల్ రోడ్డులో ఎన్.టి.ఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ అని ట్వీట్ చేశాడు వర్మ.
అయితే ఈ ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగిన వర్మ, లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నిర్మాత రాకేష్ రెడ్డిలను కట్టడి చేశారు. వారిని అక్కడే కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన వర్మ ఏపిలో ప్రజాస్వామ్యం లేదంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
I am In police custody now for the only crime of trying to tell truth ..THERE IS NO DEMOCRACY IN ANDHRA PRADESH pic.twitter.com/O7OnWop407
— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2019
JAI TDP DEMOCRACY ??? pic.twitter.com/8LPFGQx3am
— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2019