రామ్ చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా…!

-

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు హీరోలు కూడా ఏ సినిమా చేస్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మాత్రం ఎవరితో సినిమా చేస్తాడు అనేది స్పష్టత రావడం లేదు. రామ్ చరణ్ మరో స్టార్ దర్శకుడి తో సినిమా ఓకే చేసాడు అనే ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే వీరు ఇద్దరూ నిర్మాతలు గా ఒక బాలీవుడ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ సినిమా లో హీరోగా రణవీర్ సింగ్ ఉంటాడని సమాచారం.

లవ్ స్టోరీ గా ఈ సినిమా వస్తుంది అంటున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఉన్న పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినపడుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే మరో నిర్మాత కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని సమాచారం. దర్శకుడు తెలుగు దర్శకుడే ఈ సినిమాలో దాదాపు 70 శాత౦ పెట్టుబడి ఈ ఇద్దరిదే ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news