నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూస్‌ సాధించిన ఏకైక ఇండియన్ సిరీస్‌గా ‘రానా నాయుడు’

-

ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఎక్కువ వ్యూస్‌ వచ్చిన సినిమాలు, సిరీస్ ల వివరాలను నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా వెల్లడించింది. అందులో భారత్ నుంచి ‘రానా నాయుడు’ సిరీస్ చోటు దక్కించుకుంది. అంతేకాదు ఇండియా నుంచి ఈ ఒక్క సిరీస్‌ మాత్రమే ఉండడం విశేషం. రానా, వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ వివాదాల్లో నిలిచినా.. బ్లాక్‌బస్టర్‌ టాక్ సంపాదించుకుంది.

2021 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్రతి వారం ఎక్కువ వ్యూస్‌ సాధించిన టాప్ 10 మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ విడుదల చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఆరు నెలల జాబితాను విడుదల చేస్తూ.. వ్యూస్‌ ఆధారంగా సుమారు 18వేల టైటిల్స్‌ డేటాను పరిశీలించి.. గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్‌ 400ను విడుదల చేసింది. ఇందులో ‘రానా నాయుడు’ టాప్‌ 336లో నిలిచింది. భారత్‌ నుంచి ఈ సిరీస్‌ మాత్రమే టాప్‌ 400లో స్థానం దక్కించుకుంది. దీన్ని 46 మిలియన్ల గంటలు చూసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version