ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌ ప్రమాణస్వీకారం

-

ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ నూతన సర్కార్ కొలువుదీరింది. బీజేపీ అభ్యర్థి విష్ణుదేవ్‌ సాయ్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ సావో, ఎమ్మెల్యే విజయ్‌ శర్మ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఎమ్మెల్యేగా విష్ణుదేవ్‌ను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక ఆయనకు పెద్ద పదవి వచ్చేలా చూస్తామని అమిత్‌షా ఒక సభలో చెప్పడం గమనార్హం. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పడం ప్రస్తావనార్హం.

59 ఏళ్ల విష్ణుదేవ్‌ సాయ్‌ (59) ప్రస్థానం సాగిందిలా.. 

  • 1964 ఫిబ్రవరి 21న జన్మించిన విష్ణుదేవ్‌ సాయ్‌కు సర్పంచిగా ప్రస్థానం ప్రారంభించారు.
  • నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • 2014లో ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.
  • 2020 నుంచి 2022 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
  • ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా సీఎం పదవి అధిష్టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version