మెగా హీరోల‌తో రంగ‌మ్మ బ్యాక్ టు బ్యాక్

-

అన‌సూయ అలియాస్ రంగ‌మ్మ‌త కెరీర్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా సాగిపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూనే సోలోగాను నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ దిశ‌గా అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. అటు టీవీ యాంక‌ర్ గా కొన‌న‌సాగుతూ రెండు చేతులా సంపాద‌నే. 75 ల‌క్ష‌ల ఖ‌రీదు గ‌ల బెంజ్ కారు లో తిరుగుతుందంటే అనసూయ రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవ‌చ్చు. తాజాగా అమ్మ‌డికి మెగా కాంపౌండ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసే అవ‌కాశం ద‌క్కింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో న‌టిస్తుంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఇందులో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో బ‌లంగా వినిపిస్తోంది.

Rangammatha gets back to back offers with mega heroes

తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టించ‌నున్న 152వ చిత్రంలో కొర‌టాల మంచి రోల్ ఆఫ‌ర్ చేసాడ‌ని స‌మాచారం. సాధార‌ణంగా కొర‌టాల సినిమాల్లో హీరోల‌తో పాటు, హీరోయిన్ల‌కు ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంటుంది. సైడ్ క్యారెక్ట‌ర్ల‌కు ఇంపార్టెన్స్ బాగానే ఉంటుంది. అవ‌న్నీ క‌థ‌లో ఇమిడిపోయి ఉంటాయి. అందువ‌ల్లే ఆయ‌న సినిమాల్లో చిన్న పాత్ర అయినా ఎలివేట్ అవుతుంటుంది. ఈ నేప‌థ్యంలో అన‌సూయ ను ఏరికోరి తీసుకున్నాడంటే అందులో మ్యాట‌ర్ ఉంటుంద‌నే అనిపిస్తోంది. హిట్ అయితే అన‌సూయ పాత్ర‌కు మంచి గుర్తింపు ఖాయం. ప్ర‌స్తుతం ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో కొర‌టాల బిజీగా ఉన్నారు.

కీల‌క ప‌నులు పూర్త‌యిన‌ప్ప‌టికీ చిరుకు హీరోయిన్ ని సెట్ చేయ‌డం కొర‌టాల‌కు త‌ల‌కు మించిన భార‌మైంది. ఇప్ప‌టికే న‌య‌న‌తార‌, అనుష్క‌, రాశీక‌న్నా పేర్లు వినిపించిన‌ట‌ప్ప‌టికీ ఇంకా ఎవ‌ర్నీ ఫైన‌ల్ చేయ‌లేదు. దీంతో మెగాస్టార్ భామ‌పైనే ఆస‌క్తి సంత‌రించుకుంది. ఇక సినిమాను వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ కు తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే ఆగ‌స్టు 22న చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా లాంచ్ చేయాల‌ని చూస్తున్నారు. కానీ ప‌క్షంలో సైరా న‌ర‌సింహారెడ్డి రిలీజ్ త‌ర్వాత అక్టోబ‌ర్లోనే ప్రారంభం అవుతుంద‌న్న మాట వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news