జారి పడ్డ సెల్ ఫోన్ తీసుకోబోయి రెండు ముక్కలైన యువతి

-

బేగంపేట వద్ద రైలు ట్రాక్ మలుపులతో కూడుకొని ఉంటుంది. ఫోన్ తీసుకోవడానికి అశ్వినీ ప్రయత్నిస్తుండటంతో.. ఇంతలోనే మలుపు రావడంతో అశ్వినీ అదుపుతప్పి రైలు కింద పడిపోయింది.

చాలా చాలా విషాదకరమైన ఘటన ఇది. తను దిగాల్సిన స్టేషన్ వచ్చిందనే హడావుడిలో సెల్ ఫోన్ జారి పడిందని.. దాన్ని పట్టుకునే క్రమంలో పట్టుతప్పి… రైలు కింద పడి యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బేగంపేటలో చోటు చేసుకున్నది. రైలు కింద పడటంతో యువతి అక్కడికక్కడే ముక్కలు ముక్కలు అయి మృతి చెందింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మిగితా ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

రైల్వే ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్ మండిలోని బీదలబస్తీలో ఉండే అశ్విని(22) బేగంపేటలో ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం చేస్తున్నది. రోజూ ఆమె ఎంఎంటీఎస్ ఎక్కి ఆఫీసుకు వెళ్తుండేది. బుధవారం కూడా సీతాఫల్ మండీలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కిన అశ్విని.. బేగంపేట్ నేచర్ క్యూర్ ఆసుపత్రి స్టేషన్ వస్తుండగా… సీట్లో కూర్చున్న అశ్వినీ తన స్టేషన్ వచ్చిందన్న తొందరలో ఫోన్ ను చూసుకోకుండా లేచింది. దీంతో తన చేతి నుంచి ఫోన్ జారిపడి రైలు ఫుట్ బోర్డ్ వద్ద పడింది.

బేగంపేట వద్ద రైలు ట్రాక్ మలుపులతో కూడుకొని ఉంటుంది. ఫోన్ తీసుకోవడానికి అశ్వినీ ప్రయత్నిస్తుండటంతో.. ఇంతలోనే మలుపు రావడంతో అశ్వినీ అదుపుతప్పి రైలు కింద పడిపోయింది. వెంటనే ఈ ఘటనను గమనించిన ట్రెయిన్ డ్రైవర్ ట్రెయిన్ ను ఆపి కిందికి వెళ్లి చూడటంతో అశ్వినీ రెండు ముక్కలు అయి ట్రాక్ మీద కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. వెంటనే అశ్వినీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news