టెంపర్ హింది ట్రైలర్.. సింబా కాదు సింగం సీరీస్ అనొచ్చు..!

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన క్రేజీ మూవీ టెంపర్. అప్పటిదాకా ఉన్న ఎన్.టి.ఆర్ కన్ ఫ్యూజన్ కు ఓ ఫుల్ క్లారిటీ వచ్చేలా చేసిన సినిమా. సినిమా సక్సెస్ అవడమే కాదు టెంపర్ తర్వాత ఎన్.టి.ఆర్ కెరియర్ ఊపందుకుంది. టెంపర్ నుండి అరవింద సమేత వరకు వరుస హిట్లు కొడుతున్నాడు ఎన్.టి.ఆర్. ఈ టెంపర్ సినిమా హిందిలో రణ్ వీర్ సింగ్ రీమేక్ చేస్తున్నాడు.

రోహిత్ శెట్టి డైరక్షన్ లో కరణ్ జోహార్ ఈ మూవీ నిర్మించారు. రణ్ వీర్ సింగ్ కు జోడీగా సారా ఆలీ ఖాన్ ఈ మూవీలో నటించింది. సింబా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఈ ట్రైలర్ చూశాక తెలుగు టెంపర్ ఆనవాళ్లు ఎక్కడ కనిపించలేదు సరికదా ఇది టెంపర్ రీమేక్ గా కాకుండా సింగం సీరీస్ లో భాగమనిపించేలా ఉంది. అజయ్ దేవగన్ సింగం సీరీస్ కు ఇది కొనసాగింపుగా అనిపించింది.

సినిమాలో అజయ్ దేవగన్ కూడా గెస్ట్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. మరి రోహిత్ శెట్టి టెంపర్ ను సింగం సీక్వల్ గా తీయాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో కాని సినిమాలోని ఇంటెన్స్ మిస్ అయ్యే అవకాశం ఉందని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. డిసెంబర్ 28న రిలీజ్ అవబోతున్న సింబా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇక టెంపర్ ను తమిళంలో విశా అయోగ్యగా రీమేక్ చేస్తున్నాడు. మరి విశాల్ ఈ కథను ఎలా మారుస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news