క్లైమాక్స్‌కి చేరిన రాశీ ఖన్నా కెరీర్

-

రాశీ ఖన్నా కెరీర్‌ ఎండింగ్‌కి వచ్చేసిందా.. తెలుగు మేకర్స్‌ రాశీని పట్టించుకోట్లేదా.. అందుకే సోషల్‌ మీడియాలో స్పీడ్‌ పెంచుతోందా.. అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ జనాలు. రాశీ ఖన్నాకి డోర్స్‌ క్లోజ్‌ అవుతున్నాయని అందుకే అవకాశాల కోసం మ్యాగ్జిమమ్‌ ఎఫర్ట్త్ పెడుతోందని కామెంట్‌ చేస్తున్నారు. మరి రాశీ కష్టానికి ఎలాంటి రిజల్ట్‌ రాబోతోంది…

రాశీ ఖన్నా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్’ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఈ ఫ్లాప్‌తో రాశీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. జూ.ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ చేసినా, యూత్‌స్టార్‌ విజయ్‌ దేవరకొండతో కలిసి నటించినా రాశీకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ రాలేదు. ఇక ఇప్పుడైతే సినిమాలు కూడా రాట్లేదు. రాశీ ఖన్నా మళ్లీ బిజీ కావాలని, కమర్షియల్‌ హీరోయిన్‌గా స్టార్‌ రేసులో దూసుకెళ్లాలని చాలా ట్రై చేస్తోంది. స్టార్‌ మేకర్స్‌ని ఇంప్రెస్‌ చెయ్యాలని రకరకాల ఫోటోలు పోస్ట్‌ చేస్తోంది. కానీ రాశీని ఎవ్వరూ హీరోయిన్‌గా కన్సిడర్ చెయ్యట్లేదు. యంగ్‌స్టర్స్ కూడా రాశీని బెస్ట్‌ ఛాయిస్‌గా చూడలేకపోతున్నారు.

టాప్ హీరోలు రాశీ ఖన్నాని కమర్షియల్‌ హీరోయిన్‌గా చూడట్లేదు. దీంతో రాశీ ఖన్నాకి తెలుగునాట సినిమాలు తగ్గిపోతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా అనౌన్స్‌ చెయ్యలేదు రాశి. దీంతో ఈమె కెరీర్‌ క్లోజ్ అవుతోందనే కామెంట్స్‌ వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news