గుర్తుపట్టరాని స్థితిలో అభిషేక్ బచ్చన్ మేకోవర్..

-

సినిమాల కోసం తమ గెటప్పులని మార్చుకోవడం కామనే. ఐతే స్టార్ హీరోలు ఈ విషయాల్లో కొంచెం కేర్ ఫుల్ గా ఉంటారు. పూర్తిగా తమ గెటప్ మార్చేసుకుని సినిమాలు చేసేందుకు ఇష్టపడరు. సినిమాకి వచ్చేది హీరోని చూడడానికే కాబట్టి, హీరో కనబడకుండా గెటప్ కనిపిస్తే అభిమానులు తట్టుకోలేరు. కానీ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎన్ని వేషాలు వేసినా ఆసక్తిగా చూస్తుంటారు. ఈ మధ్య అమితాబ్ బచ్చన్ చేస్తున్న చాలా సినిమాల్లో ఆయన గెటప్ చాలా వైవిధ్యంగా ఉంది.

తాజాగా ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ తన గెటప్ పూర్తిగా మార్చుకుని అందరికీ షాకిచ్చాడు. బాబ్ బిశ్వాస్ సినిమా కోసం మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కనిపించడానికి చెదిరిన జుట్టు, కొంచెం ఉబికివచిన పొట్టతో కనిపించాడు. దివ్య అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. షారుక్ ఖాన్, సుజాయ్ ఘోష్.. ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి అమితాబ్ గెటప్స్ కి వచ్చిన ఆదరణే అభిషేక్ కి కూడా దక్కుతుందా లేదా చూడలి.

Read more RELATED
Recommended to you

Latest news