అతనికి చెంప చెళ్లుమనిపించే ఆన్సర్ ఇచ్చిన రష్మి..!

-

యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేస్తున్న రష్మి సిల్వర్ స్క్రీన్ పై కూడా తన మెరుపులు మెరిపిస్తుంది. సినిమాలు, టివి షోలను సమపాళ్లలో చేస్తూ వస్తున్న రష్మి ఎప్పుడూ తన అభిమానులను ట్విట్టర్ లో పలుకరిస్తుంది. అయితే కొన్నిసార్లు కొంతమంది ఆకతాయిలు రష్మి మీద చేసే కామెంట్స్.. ఆమెని అడిగే ప్రశ్నలు ఆమెను బాధపడేలా చేస్తాయి. రీసెంట్ గా అలాంటి ఓ సంఘటన జరిగింది.

రష్మితో తానో యాడ్ షూటింగ్ చేయాలని అనుకుంటున్నా అయితే మీ డాడ్ నంబర్ మిస్సైంది అంటూ కామెంట్ పెట్టాడు ఒక అభిమాని. అయితే ఇలాంటి వారిని చూడటం ఆమెకు కొత్తేమి కాదు కనుక డాడీ నంబర్ ఎందుకు నా నంబరే తీసుకో అన్నది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే రష్మి వాళ్ల నాన్న మరణించారు. నా 12 ఏళ్ల వయసులోనే మా నాన్న చనిపోయారు ఆయన నంబర్ నీ దగ్గర ఎందుకు ఉంటుంది అంటూ పిఆర్ ఏజెంట్ అంటూ చెప్పుకొచ్చిన అతని చెంప చెళ్లుమనిపించే ఆన్సర్ ఇచ్చింది రష్మి.

Read more RELATED
Recommended to you

Exit mobile version