3 కోట్లు ఎకౌంట్ లో వేస్తే.. నువ్వు చెప్పింది చేస్తా..!

-

జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన రష్మి గుంటూర్ టాకీస్ సినిమాతో హాట్ గాళ్ గా వెండితెర మీద తన సత్తా చాటింది. ఆ సినిమా నుండి రష్మికి అలాంటి అవకాశాలే వస్తున్నాయి. రీసెంట్ గా అంతకుమించి సినిమాలో కూడా అందాల విందుతో కనువిందు చేసిన రష్మి ఓ అభిమానికి అదిరిపోయే పంచ్ ఇచ్చింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది రష్మి.

అందులో భాగంగా ఓ అభిమాని దర్శకుల అవకాశాలు ఇచ్చే దాకా మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేయొచ్చు కదా అంటూ అడిగాడు. దానికి సమాధానంగా నా ఎకౌంట్ లో 3 కోట్లు వెయ్యి ఇక నువ్వు కోరుకున్నట్టే వరుసగా సినిమాలు చేస్తా అని సమాధానం ఇచ్చింది రష్మి. ఇక సుధీర్ తో తన రిలేషన్స్ మీద ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికతో ఆన్సర్ ఇచ్చింది రష్మి.

Read more RELATED
Recommended to you

Latest news