గీతగోవిందం @ 2 మిలియన్స్

-

యువ సంచలనం విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ గీతగోవిందం అనుకున్నట్టుగానే ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరింది. ఈమధ్య ఓవర్సీస్ లో తెలుగు సినిమాల హవా తగ్గిందని అంటుండగా విజయ్ అక్కడ తన స్టామినా ఏంటో చూపించాడు. పరశురాం డైరక్షన్ లో వచ్చిన గీతగోవిందం ఆబాలగోపాలాన్ని అలరించింది. అర్జున్ రెడ్డి సినిమాను  ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు కాని గీతగోవిందం మాత్రం చిన్నాపెద్ద అందరు ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రీమియర్స్ తోనే ఓవర్సీస్ లో హంగామా మొదలు పెట్టిన గీతగోవిందం ఫైనల్ గా 2 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసి అదరగొట్టింది. ఓవర్సీస్ లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా ఈ సినిమా 12వ స్థానంలో ఉంది. ఇక ఈ ఇయర్ లో 2 మిలియన్ క్రాస్ చేసిన సినిమాగా 5వ స్థానం దక్కించుకుంది గీతగోవిందం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నాచురల్ స్టార్ నానిలకు కూడా సాధ్యం కాని 2 మిలియన్ కలక్షన్స్ విజయ్ కేవలం 3వ సినిమాతోనే సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పొచ్చు. రెండు తెలుగు  రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. ఈ రేంజ్ లో విజయ్ కొట్టాడు కాబట్టే విజయ్ ను స్టార్ హీరో అనేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news