కిరాక్ పిల్ల గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

-

Rashmika chance for Geetha Govindam

కన్నడ కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక మందన తెలుగులో నాగ శౌర్య సరసన ఛలో సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా హిట్ అవడంతో అమ్మడికి సూపర్ క్రేజ్ వచ్చింది. తెలుగులో హీరోయిన్స్ కొరతను క్యాష్ చేసుకునేందుకు వచ్చిన ఈ అమ్మడు లేటెస్ట్ గా గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది.

ఈ సినిమా దర్శకుడు పరశురాం సినిమాలో హీరోయిన్ గా ఎంతోమందిని అనుకున్నాడట. ఎవరిని అడిగినా నో చెప్పారట. ఫైనల్ గా రష్మికకు ఆ పాత్ర రాసిపెట్టుంది. ఇదే విషయాన్ని ఆడియో వేడుకలో కూడా ప్రస్థావించాడు డైరక్టర్ పరశురాం. విజయ్ కు జోడిగా వద్దనుకున్నారో లేక మరేమో కాని రష్మిక మాత్రం సినిమాలో ఛాన్స్ అందుకుని తన గట్స్ ఏంటో చూపించింది.

ఆగష్టు 15న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద సమర్పణలో బన్ని వాసు గీతా గోవిందం సినిమా నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news