బాబోయ్ సాహోలో అన్ని సీన్సా..!

-

Surprise scene count for Saaho movie.. fans shocked

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తుంది. హాలీవుడ్ సినిమా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 200పైగా సీన్స్ ఉన్నాయని టాక్. లేటెస్ట్ గా రామోజి ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ షూటింగ్ స్పాట్ నుండి లీకైన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సీన్ నెంబర్ 242 షాట్ నెంబర్ 1 అంటూ క్లాప్ బోర్డ్ మీద ఉంది. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలిలోనే అన్ని సీన్స్ ఉన్నాయో లేవో కాని సాహోలో 242 సీన్ ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇదవరకు సినిమా అంటే 70 సీన్స్ లో కంప్లీట్ చేసేవారు. యువ దర్శకులు సీన్ టూ సీన్ క్లారిటీ కోసం సీన్ నిడివి తగ్గించారు.

అలా చూసుకున్నా 240 సీన్స్ అంటే బాబోయ్ అనేస్తున్నారు. అయితే చిత్రయూనిట్ మాత్రం సినిమాపై పూర్తి నమ్మకంతో ఉంది. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సాహో సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news