అనుకున్నది ఒకటి అయినది ఒకటి రష్మిక ప్లాన్స్ తిరగబడ్డాయా ..?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమా తో తెలుగు పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయింది కన్నడ బ్యూటి రష్మిక మందన. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను, టాలీవుడ్ మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ. నితిన్ తో భీష్మా సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంది. వీటిలో ఒక్క డియర్ కామ్రేడ్ మాత్రమే ఫ్లాప్ గా మిగిలింది.

 

ఇక సరిలేరు, భీష్మ సినిమాల సక్సస్ తో రష్మిక కి టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగింది. పూజా హెగ్డే తో పోటీ ఉన్నప్పటికి రష్మిక రేస్ లో తనతో సమానంగా దూసుకుపోతుంది. ఇటి తెలుగు అటు తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంది. రెండు భారీ సినిమాలలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం రష్మిక కి కరోనా కారణంగా గట్టి దెబ్బే పడిందని తెలుస్తుంది. జోరుమీదున్న ఈ కన్నడ బ్యూటీ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందట. సరిలేరు నీకెవ్వరు భీష్మ సక్సస్ లను కంటిన్యూ చేస్తూ 2020 లో నంబర్ వన్ ప్లేస్ లో ఉండాలనుకుందట.

అయితే మహమ్మారిలా వ్యాపించిన కరోనా రష్మిక ప్లాన్స్ ని తారుమారు చేసింది. ఇప్పుడు రష్మిక రెండు భారీ సినిమాలకు సంతకాలు చేసింది. అందులో ఒకటి అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు పుష్ప.. కాగా మరొకటి కార్తీ సరసన తమిళంలో మరో సినిమా. అయితే ఈ రెండు సినిమాలు గనక సక్సస్ అయితే భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలనుకుందని టాక్. కాని ఇప్పుడు నెలకొన్న నేపథ్యంలో నిర్మాతలు అందరికి రెమ్యూనరేషన్ బాగా తగ్గిస్తున్నారని అంటున్నారు. ఇది కూడా రష్మిక అనుకున్న దానికి మైనస్ అయిందట.