ఎయిర్‌పోర్ట్‌లో ర‌ష్మిక డ్యాన్స్‌.. వైరల్‌ వీడియో

-

దక్షిణాది సినీ పరిశ్రమంలో ఓ వెలుగు వెలుగుతున్న ప్రముఖ అగ్ర కథానాయిక, కన్నడ అందాల భామ రష్మిక మందన్న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటి.. గీత గోవిందం సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఇక తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సక్సెస్ లతో రష్మిక మందన్నా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది.

ప్ర‌స్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది హీరోయిన్ రష్మిక మందన్నా.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ భామేదే హవా కొన‌సాగుతోంది. ఇక స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను న‌టిస్తోంది. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర అదిరిపోయేలా డిజైన్ చేశాడట సుకుమార్‌. అంతేకాదు, ఇందులో బన్నీకి ఆమెకు మధ్య బాలీవుడ్‌ రేంజ్‌లో చూపించే రొమాన్స్‌ ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ర‌ష్మిక నెటిజ‌న్ల‌తో చివాట్లు తింటుంది. ఎందుకూ అంటారా..? తాజాగా రష్మిక హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ముందున్న ఫొటోగ్రాఫర్లు ఫొటోలు ఆమె ఫొటలు, వీడియోలు తీస్తుంటే.. రష్మిక డ్యాన్సులు వేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఆ వీడియో బయటికి రావడంతో నెటిజన్లకు తీవ్రంగా మండిప‌డుతున్నారు. రష్మిక ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. రెండు హిట్లు వచ్చినంత మాత్రన అంత అక్క‌ర్లేదంటూ ప్ర‌స్తుతం ర‌ష్మిక‌ను ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news