శ్రీలీల టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఇప్పుడు. ఏ సినిమా చూసినా ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. చేతిలో డజను సినిమాలను పెట్టుకుని తెలుగు తెరపై దూసుకెళ్తోంది ఈ భామ. మహేశ్ బాబు, రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్, నితిన్ వంటి యంగ్ హీరోలతోనే కాకుండా పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతోనూ జత కడుతోంది. ఇక ఇటీవలే ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో కలిసి VD12 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమానికి కూడా శ్రీలీల హాజరైంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తన కాల్షీట్లో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల శ్రీలీల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే శ్రీలీల స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.
విజయ్‌తో రష్మిక జోడీ కట్టనుందన్న వార్తలు విన్న నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ ఫేవర్ జంటను మళ్లీ ఆన్‌స్క్రీన్ పై చూడబోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట మూడోసారి ముచ్చటగా వెండితెరపై సందడి చేస్తే చూడాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నామంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజం కావాలి దేవుడా అంటూ అప్పుడే దేవుడిని కాకా పట్టడం కూడా షురూ చేశారు.