గవర్నర్ తమిళి సై నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమెను అభినందించారు బిజేపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళి సై తిరస్కరించడాన్ని కేంద్రమంత్రి సమర్థించారు. సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి కానీ కేసీఆర్ కుటుంబానికి సేవ చేసిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నాడు.
కాగా, ఇటీవలే అంతా సర్దుకుందని భావిస్తున్న సమయంలో గవర్నర్.. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను తిరస్కరించారు. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ మంత్రులు తప్పుబట్టారు. రాజకీయ నేపథ్యం ఉందని ఇద్దరు పేర్లను తిరస్కరించడం అత్యంత దుర్మార్గం అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎస్టీ, ఎంబీసీ సామాజిక వర్గాలను అగౌరవపరచినట్లేనని వ్యాఖ్యానించారు.గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ మంత్రులు ఆరోపించారు.