సైలెంట్‌గా ఓటీటీలోకి ‘రావణాసుర’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

-

ఫ్లాప్​లతో సతమతమైపోతున్న మాస్​మహారాజ రవితేజకు ఈ ఏడాది ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల రూపంలో హిట్​లు వచ్చి చేరాయి. ధమాకాతో ఏకంగా రవితేజ వంద కోట్ల క్లబ్​లో చేరాడు. ఇక మన రాజా ఫామ్​లోకి వచ్చాడనుకుంటే.. అప్పుడే రావణాసూర సినిమాతో మరో ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. రిలీజ్​కు ముందు ఈ సినిమా గురించి ఎంత హడావుడి చేసినా.. థియేటర్​లోకి వచ్చాక మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ కొత్తగా ఉన్న కథనం ఆసక్తిగా లేదని పలువురు సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు. రవితేజ నటన మాత్రం ఈ సినిమాలో వేరే లెవల్లో ఉందని ప్రేక్షకులు అన్నారు. నెగిటీవ్‌ క్యారెక్టర్‌లో రవితేజ జీవించేశాడని అభిమానులు ఖుష్ అయ్యారు.

ఇక ఈ సినిమాను థియేటర్​లో చూడటం మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్ధరాత్రి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ముందస్తు అనౌన్స్‌మెంట్‌ లేకుండానే ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ జోడీగా అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడలు న‌టించారు. అక్కినేని సుశాంత్‌ కీలకపాత్ర పోషించాడు.

Read more RELATED
Recommended to you

Latest news