సీక్వెల్ ను న‌మ్ముకుంటున్న డైరెక్ట‌ర్‌, హీరో.. రిస్క్ చేస్తున్నారా!

ఆ డైరెక్ట‌ర్‌, హీరోకు సీక్వెల్ కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే హీరో ఓ సినిమాను సీక్వెల్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట‌ర్ కూడా త‌న సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి చేసిన సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. కాబ‌ట్టి దానికి వీరిద్ద‌రూ క‌లిసి సీక్వెల్ తీయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇంత‌కీ వారెవ‌రో మీరు గుర్తుకొచ్చిందా. వారేనండి మ‌న మాస్ మ‌హారాజ ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.

వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన రాజా ది గ్రేట్ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాలో ర‌వితేజ మొద‌టి సారి కండ్లు లేని వాడిగా న‌టించి మెప్పించారు. వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ర‌వితేజ‌కు ఈ మూవీతో హిట్ ఇచ్చాడు. అనిల్ రావి పూడి. ప్ర‌స్తుతం ర‌వితేజ ఖిలాడీలో న‌టిస్తున్నాడు. అటు అనిల్ రావిపూడి ఎఫ్-2కి సీక్వెల్ గా ఎఫ్‌-3 తీస్తున్నాడు.

అయితే ఇటీవ‌ల అనిల్ రావిపూడి ర‌వితేజ‌ను క‌లిసి రాజా ది గ్రేట్ సీక్వెల్ గా ఒక స్టోరీ లైన్ వినిపించాడంట‌. ఇక ర‌వితేజ‌కు లైన్ న‌చ్చ‌డంతో.. క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని చెప్పాడ‌ని స‌మాచారం. ఇక ఎఫ్‌-3లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఆ సినిమా షూటింగ్ అయిపోగానే.. ఫుల్ స్క్రిప్టు రెడీ చేయ‌నున్నాడు. ఇక వీరి కాంబోలో సినిమా రావాలంటే కొంచెం టైమ్ ప‌ట్టేలా ఉంది. ఏదేమైనా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కు ప్లాన్ చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.