82 ఏళ్ళ మహిళ ఆక్సీజన్ అవసరం అయితే సిలెండర్ లేకుండా ఏం చేసిందంటే…!

కరోనా విషయంలో ఇప్పుడు కంగారు పెట్టేది ఒక్కటే ఆక్సీజన్ కొరత. ఈ ఆక్సీజన్ కొరత విషయంలో ప్రభుత్వాల చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ కు చెందిన 82 ఏళ్ల వృద్ద మహిళ వినూత్నంగా ఆక్సీజన్ సమస్య నుంచి బయటపడింది. తన పొట్టపై పడుకోవడంతో ఆమె ఆక్సీజన్ లెవెల్స్ ని క్రమంగా పెంచుకున్నారు. ఆమె తన కుమారుడు శ్యామ్ శ్రీవాస్తవ సహకారంతో మరియు డాక్టర్ సలహాలను పాటిస్తూ ఆ విధంగా చేసారు.

కేవలం 12 రోజుల్లో కరోనావైరస్ పై విజయం సాధించారు. తన తల్లి కోసం కొడుకు కరోనా ఉన్నా సరే ఆమె ఉన్న గదిలోనే ఉండి ఆక్సిజన్ లెవెల్స్ ని 24X7 పర్యవేక్షించాడు. ఆక్సిజన్ లెవెల్ 79 కి పడిపోయిందని ఆ తర్వాత కంగారు పడ్డామని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని కాని పట్టుదలగా ఆమెతో మంచంపై పొట్టపై పడుకోవాలని చెప్పి లవంగం, కర్పూరం మరియు క్యారమ్ విత్తనాల మిశ్రమాన్ని తయారు చేసి ఇచ్చామని అన్నారు. ఆక్సిజన్ లెవెల్ నాలుగు రోజుల్లో 94 కి పెరిగింది అన్నారు.