ర‌వితేజ సంచ‌ల‌న నిర్ణ‌యం!

-

స్టార్ హీరో తో సినిమా అంటే మినిమం ఏ నిర్మాత అయినా ప‌ది కోట్లు స‌మ‌ర్పించాల్సిందే. అడ్వాన్స్ గా 5…షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత మ‌రో 5 కోట్లు ఇచ్చుకోవాల్సిందే. సినిమా హిట్..ప్లాప్ తో హీరోకి సంబంధం ఉండ‌దు. ప్లాప్ అయితే ద‌యాగుణంతో కొంత‌ మంది హీరోలు తిరిగి ఎంతో కొంత తిరిగి ఇస్తారు. అది హీరోల వ్య‌క్తిత్వం పై ఆధార‌ప‌డింది. తిరిగి ఇవ్వాలి అన్న నిబంధంన ఎక్క‌డా లేదు. ఇదే మాట‌ను వంట ప‌ట్టించుకున్న మాస్ రాజా ర‌వితేజ సినిమాకు10 కోట్లు ఛార్జ్ చేస్తాడు. ఆయ‌న సినిమాలకు రిజ‌ల్ట్ తో సంబంధం లేదు. త‌న మార్కెట్ ప్ర‌కారం ఏ నిర్మాత అయినా చెల్లించుకోవాల్సిందే. మొన్న‌టి వ‌ర‌కూ రాజా ఫాలో అయిన పంథా ఇదే. అయితే ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా మిగులుతున్నాయి.

ravi teja no remuneration for next movie

క‌నీసం సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా తీసుకు రాలేక‌పోతున్నాయి. దీంతో నిర్మాత‌ల‌కు, పంపిణీ దారుల‌కు, బ‌య్య‌ర్ల‌కు భారీగా న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. అయినా ర‌వితేజ అంటే ఓ బ్రాండ్ కాబ‌ట్టి సినిమాలు కొని రిలీజ్ చేస్తున్నారు. ఇది నిన్న‌టి మాట‌. నేడు సీన్ మ‌రోలా ఉంద‌ని తాజా స‌మాచారం. ర‌వితేజ పారితోషికంలో స‌డ‌లింపు ఇచ్చాడు. ప్ర‌స్తుతం చేస్తోన్న డిస్కో రాజా సినిమాకు రిబేట్ ఇచ్చి సినిమా చేస్తున్నాడు. అయితే త‌దుప‌రి మ‌హా స‌ముద్రం అనే మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకైతే ఏకంగా ఒక్క రూపాయి కూడా తీసుకోవ‌డం లేదుట‌. మార్కెట్ డౌన్ ఫాలో ఉండ‌టంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

సినిమా పూర్తిచేసి రిలీజ్ చేసిన త‌ర్వాత హిట్ అయితే గ‌నుక అందులో ప‌ర్సంటేజ్ తీసుకునేలా నిర్మాత‌లతో ఒప్పందం చేసుకున్నాడుట‌. ఇక‌పై ఇదే కొన్నాళ్ల పాటు త‌దుప‌రి సినిమాల‌కు కొన‌సాగించాల‌నుకుంటున్నాడుట‌. ఈ ఆలోచ‌న మంచిదే. కానీ సినిమా హిట్ అయితేనే వాటా వ‌స్తుంది. ఫెయిలైతే గ‌నుక మినిమం పారితోషికం కూడా రాదు. ఒప్పందం లో కొన్ని స‌డ‌లింపులు ఉన్న‌ప్ప‌టికీ ప్లాప్ అయితే ఏ నిర్మాత క‌నీసం కూడా చెల్లించుకోలేడు. హీరో కూడా ఎంతో కొంత ఇవ్వండ‌ని అడ‌గ‌లేని స‌న్నివేశం ఉంటుంది. ప్ర‌స్తుతం రాజా ఉన్న ప‌రిస్థితుల్లో ఈ ఆప్ష‌న్ త‌ప్ప మ‌రోదారి లేద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news