క్రేజీ బజ్..SSMB28లో మహేశ్ ఫాదర్‌గా స్టార్ హీరో రవిచంద్ర!

-

మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న SSMB28 ఫిల్మ్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. మే 31న చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వస్తుందని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.

మూవీకి సంబంధించిన టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ‘పార్థు’,‘అర్జునుడు’ అనే టైటిల్స్ సినిమాకు పెట్టబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజమెంతుందో తెలియదు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..మహేశ్ బాబు-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ ఫిల్మ్ లో మహేశ్ ఫాదర్ రోల్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నదని సమాచారం.

ఆ రోల్ కు కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ ను తీసుకురావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. రవిచంద్రన్ గతంలో చిరంజీవి, నాగార్జునలతో తెలుగులో సినిమాలు చేశాడు. ఈయన కన్నడ ప్రేక్షకులకు చివరగా ‘కురుక్షేత్రం’ సినిమాలో కనిపించాడు. ఇందులో కృష్ణుడి పాత్ర పోషించారు. SSMB 28 సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక పూజా హెగ్డే నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news