క్రాక్… టీజర్ చంపేసాడు గా…!

-

గోపి చంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజా హీరోగా నటిస్తున్న చిత్రం క్రాక్. డిస్కో రాజా తో ఫ్లాప్ ఎదుర్కొన్న రవితేజా ఈ సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. శ్రుతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ని మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసారు. ఈ సినిమా లో రవితేజా పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రాక్ టీజర్ ఇప్పుడు ఆకట్టుకుంది.

రవితేజా లుక్ ఆయన అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా వచ్చే వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మే 8 న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ టీజర్ కి విడుదల చేసిన కాసేపటికే మంచి స్పందన వచ్చింది. రవితేజ-గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌శీను’, ‘బలుపు’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.

దీనితో ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అంటున్నారు ఆయన అభిమానులు. ఈ సినిమాపై రవితేజా కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు. అసలు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజా ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇటీవల జనవరి 26 సందర్భంగా విడుదలైన డిస్కో రాజా సినిమా రవితేజా కి మంచి హిట్ ఇవ్వలేదు. దీనితో సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news