టీం ఇండియా ఏదైనా జట్టుతో మ్యాచ్ ఆడుతుంది అనగానే చాలా మందికి ఉండే ఆసక్తి, కోహ్లీ సెంచరీ చేసాడా లేదా అని, ఎందుకంటే కోహ్లీ సెంచరీ కోసం చాలా మంది ఎదురు చూస్తారు. అతను ఆడితే సెంచరీ లేదా అర్ధ సెంచరీ . 11 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో కోహ్లీ ఇదే విధంగా జరుగుతూ వస్తుంది. కోహ్లీ సెంచరీ చేయని సీరీస్ ఉండదు. దాదాపుగా అతని కెరీర్ మొత్తం ఇదే విధంగా సాగుతూ వస్తుంది.
అయితే కోహ్లి ఈ మధ్య వరుసగా విఫల౦ అవుతూ వస్తున్నాడు. గత 19 ఇన్నింగ్స్ లలో అతను ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. కివీస్ పర్యటనలో వరుసగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచుల వన్డే సీరీస్ లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్, ఓపెనర్ కెఎల్ రాహుల్ సెంచరీలు చేసారు గాని అతను మాత్రం చేయలేదు. దీనితో కోహ్లీ సత్తా తగ్గింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.
2011 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ నెల వరకు వరుసగా 24 ఇన్నింగ్స్ లలో కోహ్లీ బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. 2014లో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో కూడా సెంచరీ లేదు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలోనూ కోహ్లీ, 5 టెస్టుల్లో మొత్తం 134 పరుగులే చేసాడు కోహ్లీ. ఈ సీజన్ లో కూడా ఇదే విధంగా ఉంది కోహ్లీ ప్రదర్శన. ఆరు అర్ధ సెంచరీలు చేసాడు గాని ఒక్క సెంచరీ కూడా చేయలేదు. దీనితో కోహ్లీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది.