రంగ‌స్థ‌లం సీక్వెల్ వ‌ద్దంటున్న మెగా ఫ్యాన్స్‌.. ఇదీ అస‌లు కార‌ణం!

చ‌ర‌ణ్ కెరీర్ లో రంగ‌స్థ‌లం ఓ మైలు రాయి. ఈ సినిమా చర‌ణ్ కు విప‌రీత‌మై క్రేజ్ ను పెంచేసింది. త‌న న‌ట‌న‌ను మ‌రో లెవ‌ల్ లోకి తీసుకెళ్లింది. అంతే కాదు ఈ మూవీ ఇండ‌స్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఎందుకంటే హీరో ఓ అవిటి వాడిగా న‌టించాలంటే దానికి చాలా డేర్ ఉండాలి. కానీ రామ్ చ‌ర‌ణ్ మాత్రం చెవిటి వాడిగా న‌టించి మెప్పించాడ‌ని చెప్పాలి.

ప‌ల్లెటూరి జాన‌ప‌థ సినిమాగా సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులోని ప్ర‌తి పాత్ర క‌ట్టిప‌డేసేదే. స‌మంత కూడా ప‌ల్లెటూరి అమ్మాయిలా జీవించేసింది. ప్ర‌తి స‌న్నివేశం అద్భుతంగానే ఉంటుంది. ఎవ‌రికి వారు త‌మ పాత్ర‌ల్లో జీవించార‌నే చెప్పాలి. ఇలాంటి ట్రెండ్ సెట్ట‌ర్ మూవీకి సీక్వెల్ అనేది ఎవ‌రైనా కావాల‌నే కోరుకుంటారు.

కానీ మెగా అభిమానులు మాత్రం వ‌ద్ద‌ని వారిస్తున్నారంట‌.ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మెగా అభిమానులు సోషల్ మీడియాలో వ‌ద్ద‌ని పోస్టులు పెడుతున్నారు.

ఎందుకంటే రంగ‌స్థ‌లం అంటే అభిమానుల‌క అదో అద్భుతం. దీనికి సీక్వెల్ అంటే మొద‌టి భాగంలో ఉన్న ఫ్లేవర్ పోకుండా చూసుకోవాలి. ఏ మాత్రం బెడిసి కొట్టినా.. ఫ్లాప్ ప్ర‌మాదం ఉంది. అంతే కాదు దాని ఇంపాక్ట్ మొద‌టి సినిమాపై ప‌డే అవకాశం కూడా ఉంది. కాబట్టి చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వేరే ఏదైనా సినిమా తీస్తే బాగుంటుంది కానీ సీక్వెల్ మాత్రం వ‌ద్ద‌ని చెబుతున్నారంట అభిమానులు. చూడాలి మ‌రి దీనికి సంబంధించి ఏదైనా ప్ర‌క‌ట‌న వ‌స్తుందో లేదో.