ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే.. 2 గంటల్లో సిలిండర్‌!

-

మీరు ఎల్‌పీజీ వినియోగదారులా? మీ ఇంట్లో గ్యాస్‌ అయిపోయిందా? అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం గంటల వ్యవధిలోనే మీ సిలిండర్‌ డెలివరీ అయిపోతుంది. అది ఎలాగో తెలుసుకుందాం. సాధారణంగా ఈ రోజుల్లో గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారు చాలా తక్కువ. ఎప్పుడైనా మన ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోతే సిలిండర్‌ డెలివరీ పొందడానికి కనీసం మూడు, నాలుగు రోజుల సమయం పడుతుంది. ఇక పండుగల సమయల్లో అయితే వారం రోజుల టైమ్‌ కూడా పడుతుంది.

అయితే, ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. మీరు ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే కేవలం 2 గంటల్లోనే గ్యాస్‌ డెలివరీ అయిపోతుంది. అయితే, ఇది కేవలం 5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌కు మాత్రమే వర్తిస్తుందన్న విషయం తెలుసుకోండి. సిలిండర్‌ అయిపోయిన వెంటనే ఈ సేవలు మీరు పొందినప్పుడు గ్యాస్‌ డెలివరీకి అదనంగా రూ.25 ఛార్జీలుగా వసూలు చేస్తారు. 1800224344 నంబర్‌కు కాల్‌ చేసిన వెంటనే సిలిండర్‌ డెలివరీ గంటల్లో అయిపోతుంది. కానీ, ప్రస్తుతం ఇది కేవలం భారత్‌ గ్యాస్‌ వినియోగదారులకే వర్తిస్తుంది. మన భాగ్యనగరంలో కూడా వీటి సేవలు అందుబాటులో ఉన్నాయి.

5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ వాడే వినియోగదారులు కూడా సేవలు పొందవచ్చు. ఈ ఐదు కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ పొంటానికి ఎటువంటి అడ్రస్‌ ప్రూఫ్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ఐడీ ప్రూఫ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు హోమ్‌ డెలివరీ సదుపాయం లేకపోతే మీ ఇంటికి దగ్గర్లో ఉన్న కిరాణా దుకాణం లేదా సూపర్‌ మార్కెట్ల వద్ద ఐడీ ప్రూఫ్‌ చూపించి డబ్బులు చెల్లిస్తే ఐదు కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ను మీ ఇంటికి తీసుకెళ్లచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news