ఆ రీమేక్ పై కన్నేసిన బాలయ్య..!

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాలు తెలుగులో రీమేక్ చేయడం సర్వసాధారణం. అక్కడ సినిమాలు ఇక్కడకు ఇక్కడ సినిమాలు అక్కడకు వెళ్తుంటాయి. నచ్చిన సినిమాను తెలుగు ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నాలు చేస్తారు. అక్కడ సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా మంచి ఫలితాన్ని రాబడుతున్నాయి. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన విక్రంవేద మూవీని తెలుగు రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ సాధించింది. తెలుగులో ఆ సినిమాను బాలకృష్ణ, రాజశేఖర్ కలిసి చేస్తారని తెలుస్తుంది. అందులో ఒకరు గ్యాంగ్ స్టర్ కాగా.. మరొకరు పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు బాలయ్య. మరి ఈ రీమేక్ డైరక్షన్ ఎవరు చేస్తారు. బాలయ్య, రాజశేఖర్ నిజంగా ఈ సినిమా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.