రెజీనా కసాండ్రా..టాలీవుడ్ శివ మనసులో శ్రుతి అంటూ ఎస్ఎంఎస్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ అందంతో పాటు నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తర్వాత వచ్చి రొటీన్ లవ్ స్టోరీతో తెలుగు కుర్రాళ్లు ఈ చెన్నై చిన్నాదానితో ప్రేమలో పడిపోయారు.
రొటీన్ లవ్ స్టోరీ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత రెజీనాకు వరుస అవకాశాలు వచ్చాయి. ఓవైపు తెలుగులో బిజీగా ఉంటూనే మరోవైపు తమిళ, కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. అనంతరం ఈ భామ బాలీవుడ్‌కు వెళ్లింది. బీ టౌన్లో ఏక్ లడ్ కీ కో దేఖాతో ఐసా లగా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇటీవల ఫర్జీ వెబ్ సిరీస్‌తో మరోసారి అలరించింది. అంతకుముందు శూర్వీర్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది.
రెజీనా కసాండ్రా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఖుష్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్‌లో చాలా ట్రెడిషన్ల్ లుక్‌లో సందడి చేసింది. ఈ ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
పింక్ కలర్ డ్రెస్‌లో రెజీనా చాలా అందంగా కనిపించింది. ఎత్నిక్ వేర్‌లోనూ ఈ బ్యూటీ ముద్దుగా ఉంది. చెవులకు జుంకాలు పెట్టుకుని కవ్వించే పోజులతో కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రెజీ.. యూ ఆర్ సో క్యూట్ అంటూ కుర్రాళ్లు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.