ట్విట్టర్ నుండి బయటకు వచ్చిన రేణూ దేశాయ్

-


పవన్ నుండి విడిపోయాక చాలా సంవత్సరాలు పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటూ వచ్చిన రేణు దేశాయ్ ఈ మధ్యే తన కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకుంది. దీనిపై సోషల్ మీడియాలో ఆమెను వ్యతిరేకించే వారే ఎక్కువగా తయారయ్యారు. దీంతో విసిగిపోయిన రేణు దేశాయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

ట్విట్టర్ ద్వారా ఆమె మాట్లాడుతూ ‘ట్విట్టర్ నిండా నెగెటివిటీ ఉంది. ఇక్కడ ఉండే అజ్ఞాతవ్యక్తులు సినిమా గురించైనా, ఒక రాజకీయ నాయకుడి గురించైనా నెగెటివ్ గానే మాట్లాడటానికే ఇష్టపడతారు. అందుకే ఈ నెగెటివిటీకి దూరంగా ఉండటానికి ట్విట్టర్ నుండి వెళ్లిపోవాలనుకుంటున్నాను. నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేసి కొద్దిసేపటికే తాన్ ట్విట్టర్ అకౌంట్ ను డీ-యాక్టివేట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news