రవితేజ సినిమా నుంచి రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ !

మాస్ మ‌హా రాజ రవితేజ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే…. రవితేజ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు. 1970లో స్టూవ‌ర్టుపురంలోని టైగ‌ర్ నాగేశ్వ‌రరావు అనే ఒక దొంగ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.ఈ సినిమాను వంశీ తెర‌కెక్కిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకి సంబంధించిన లుక్ ను.. వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె ” హేమలత లవణం” పాత్రలో కనిపిస్తారని.. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. 18 సంవత్సరాల తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదేనంటూ మరింత ఆసక్తిని పెంచారు. ఇక ఈ సినిమాలో నుపుర్ స‌న‌న్ ను హీరోయిన్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసింది. నుపుర్ స‌న‌న్ సింగ‌ర్ గా బాలీవుడ్ కు పరిచయం అయింది.

కృతి స‌న‌న్ సోద‌రియే.. నుపుర్ స‌న‌న్. ప్రస్తుతం రవితేజ ” ధమాకా” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో ఉన్నాడు. ఆ తరువాత “రావణాసుర” సినిమా లైన్ లో ఉంది. ఈ రెండు చిత్రాల తరువాత ” టైగర్ నాగేశ్వరరావు” వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.