పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందా ? అంటే అవునననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె నటిగా ఎంట్రీ ఇవ్వడం లేదట. సినిమా వెనుక ఉండి పనిచేస్తుందట. అంటే.. తెర వెనుక రోల్ పోషించేందుకు సిద్ధమవుతున్నదట. అదీ తెలుగులోనే కావడం విశేషం. ఈ మధ్యే సినిమాల్లో ఆమె రీ ఎంట్రీకి సంబంధించి పలు పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటిని అంతా కొట్టి పారేశారు. ఎందుకంటే.. పవన్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది కదా. ఇటీవలే నిశ్చాతర్థం కూడా జరిగింది. మరి ఇలాంటి సమయంలో ఆమె సినిమాల్లోకి మళ్లీ ఎలా వస్తుంది ? అని అంతా భావించారు. కానీ అది తప్పని తేలింది.
రేణు దేశాయ్ ఈ మధ్యే ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన ఫ్యూచర్ గురించిన పలు అంశాలపై స్పష్టత ఇచ్చింది. తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నమాట వాస్తవమేనని చెప్పింది. కాకపోతే ఈ సారి నటిగా కాకుండా తెర వెనుక ఉండి పనిచేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఆ సినిమాకు తాను రచయితగా వ్యవహరిస్తుందట. అందుకే ఓ కథను సిద్ధం చేస్తున్నదట. అది రైతుల బాధలు, ఆత్మహత్యలపై ఉంటుందట. అందుకని స్వయంగా ఆమె రైతుల వద్దకు వెళ్లి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకుందట.
అలా స్వయంగా ఫీల్డ్‌లోకి వెళ్లి అన్ని అంశాలను పరిశీలించి కథను సిద్ధం చేశాక, పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని తరువాతే షూటింగ్ స్టార్ట్ చేస్తానని రేణూ దేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఆమె ఇప్పటికే మరాఠీ భాషలో ఓ సినిమా చేసిన విషయం విదితమే. దానికి ఆమె స్వయంగా దర్శకత్వం కూడా వహించింది. ఇక త్వరలో చేయబోయేది తెలుగులో. దీంతో ఆమెకు ఇది రెండో సినిమా అవుతుంది. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో రేణూ దేశాయ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూస్తే తెలుస్తుంది.