Big Boss OTT Telugu: కెప్టెన్సీ టాస్క్ ఇంట్రెస్టింగ్..సంచాలక్‌గా బాబా మాస్టర్..పోటీ పడ్డ కంటెస్టెంట్స్

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షో ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా గేమ్ పై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఇక బుధవారం నాటి ఎపిసోడ్ లో ‘బిగ్ బాస్’ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చేశారు. ఈ పోటీలో కంటెస్టెంట్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ‘బిగ్ బాస్’ ఇచ్చిన టాస్క్..‘‘ఏలియన్స్ వర్సెస్ హ్యూమన్స్’’ కాగా, ఈ టాస్క్ కు సంచాలక్ గా బాబా భాస్కర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు.

ఏలియన్స్ టీమ్ లోబిందు మాధవి, అరియానా, హమీద, నటరాజ్ మాస్టర్ లు ఉండగా, హ్యూమన్స్ టీమ్ లో అఖిల్, అనిల్ తదితరులున్నారు. ఏలియన్స్ గేమ్ విన్ కావాలంటే వాళ్ల దగ్గరున్న పెయింట్‌ను హ్యూమన్స్..రెండు చేతులకు అప్లై చేయాలి. అలా చేస్తే వాళ్లకు చార్జింగ్ వస్తది.

అలా వాళ్లకు ఒక పాయింట్ వస్తుంది. హ్యూమన్స్ టీమ్ గెలవాలంటే ఫైవ్ మెంబర్స్ దగ్గర ఉన్న మూడు లైవ్ పోర్ట్స్‌ను దొంగిలించి వాటిని పగులగొట్టాలి. అలా చేస్తే ఒకరి ప్రాణం పోతుంది. అలా ఎవరు మిగిలితే వాళ్లు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు.

ఇక ఈ టాస్కలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య భౌతిక ఘర్షణలకు చోటు కూడా ఏర్పడింది. శివ పెయింట్ కనబడకుండా ఉండేందుకు గాలిలో ఎగిరేస్తుంటారు. ఇంతలో ఫిమేల్ కంటెస్టెంట్స్ కంప్లయింట్స్ కూడా పెరిగిపోయాయి. అలా ఈ గేమ్ కొనసాగింది. కంటెస్టెంట్స్ మధ్య ఈ టాస్కు విషయమై డిస్కషన్స్ కూడా జరిగాయి. చివరకు ఈ కెప్టెన్సీ కంటెండర్స్ లో ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news