దేశంలో ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఎలాగుందో అద్ధం పట్టే మరో ఘటన చోటు చేసుకుంది. కరెంట్ పోతే కనీసం జనరేటర్, బ్యాటరీల సౌకర్యాలు కూడా ఉండటం లేదు. సెల్ ఫోన్లు, టార్చ్ లైట్ల కింద ప్రసవాలు జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కరెంట్ లేకపోవడంతో చంటిపిల్లలు, తల్లులు ఉక్కపోతలు, దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్ల వెలుగులో ప్రసవాలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో జరిగింది. కరెంట్ లేకపోవడంతో ఏకంగా సెల్ ఫోన్ల లైట్లు, టార్చి వెలుగుల్లో మహిళకు పురుడు పోశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. గంజాం జిల్లా పొలసర కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో విద్యుత్ అంతరాయం కారణంగా మహిళ టార్చ్ లైట్ల వెలుగులో ప్రసవించింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.