రాజ‌కీయ‌ల్లోకి ఎంట్రీపై వ‌ర్మ క్లారిటీ.. అలా అనేశాడేంటి

రామ్‌గోపాల్ వ‌ర్మ ఎప్పుడు ఎవ‌రిపై ఎలాంటి బాంబులాంటి వ్యాఖ్య‌లు చేస్తాడో తెలియదు. ఏ విష‌యాన్ని అయినా త‌న‌దైన్ స్టైల్‌లో వివాదాస్ప‌దంగా మారుస్తుంటారు. ఇక ఇప్పుడు స్పార్క్ ఓటీటీ అనే సంస్థ‌ను నెల‌కొల్పాడు. ఇక దీని ప్ర‌మోష‌న్‌లో భాగంగా మీడియాతో ఇంట‌రాక్ట్ అయ‌యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌రో వివాదాస్ప‌ద కామెంట్ చేశాడు.

త‌నకు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ‌మే లేద‌ని చెప‌పారు. ఎందుకంటే జ‌నాల‌కు తాను సేవ చేయ‌లేన‌ని, అలాంటి క్యారెక్ట‌ర్ త‌న‌ది కాద‌ని స్ప‌ష్టం చేశారు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాళ్లు సేవ‌చేయాల‌నుకుంటార‌ని, తాను అలాంటి వ్య‌క్తిని కాద‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు. ఇక తాను ఒక ఫ్రెండ్ తో క‌లిసి స్పార్క్ ఓటీటీని తీసుకొస్తున్న‌ట్టు చెప్పాడు. ఇది రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని, తాను డైరెక్ట్ చేసిన డీ కంపెనీ సినిమాతోనే స్టార్ట్ అవుతుంద‌ని వివ‌రంచారు. మ‌రి ఇది ఏ రేంజ్‌లో స‌క్సెస్‌ఫుల్ అవుతుందో చూడాలి.