లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో ఎన్.టి.ఆర్ పాత్రదారి డీటైల్స్ ఇవే..!

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఈ నెల 29న రిలీజ్ కు రెడీ అవుతుంది. సెన్సార్ పూర్తి కాలేదని వస్తున్న వార్తలకు షాక్ ఇస్తూ తన సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుందని అనుకున్నట్టుగా మార్చి 29న రావడం కన్ఫాం అని అన్నారు వర్మ. ఇక సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రదారి గురించి మొట్టమొదటిసారి నోరు విప్పాడు వర్మ.

అతనో రంగస్థల కళాకారుడు అని.. అతని పేరు విజయ్ కుమార్ అని అన్నారు వర్మ. తన సినిమాల్లో పాత్రల విషయంలో అసలు కాంప్రమైజ్ కాని ఆర్జివి ఎన్.టి.ఆర్ గా అచ్చుగుద్ది నట్టుగా ఉన్న విజయ్ కుమార్ ను పట్టుకున్నాడు. సినిమా మొదలు పెట్టడానికి 2 నెలలు ముందు నుండి అతనికి శిక్షణ ఇచ్చామని చెప్పాడు ఆర్జివి. క్రిష్ తీసిన ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఎన్.టి.ఆర్ గా నందమూరి బాలకృష్ణ అంతగా మెప్పించలేదు. కాని వర్మ సెలెక్ట్ చేసిన ఈయన మాత్రం ఎన్.టి.ఆర్ ను డిటో దించేశాడు. మరి చూపులకు అతను ఎన్.టి.ఆర్ లా ఉన్నా ఎన్.టి.ఆర్ లా నటించాడా లేదా అన్నది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news